బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. ఆ సమయంలో రెండింటిలో వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అసోంలోని జోర్హత్ నిమతి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ పడవ మజులి నుంచి నిమతి ఘాట్ కు వస్తుండగా.. ఇంకొకటి ఎదురుగా వచ్చింది. రెండు పడవలు బలంగా ఢీకొట్టుకున్నాయి.
ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతయిన వారికోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటిదాకా 40 మందిని కాపాడారు. మిగిలిన వారికోసం వెతుకుతున్నారు.
Saddened by the boat accident in Assam. All possible efforts are being made to rescue the passengers. I pray for everyone’s safety and well-being.
— Narendra Modi (@narendramodi) September 8, 2021
Advertisements
ప్రధాని మోడీ ఈ ఘటనపై స్పందించారు. ప్రయాణికులను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అసోం సీఎం ఘటనా స్థలికి గురువారం వెళ్తానని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మజులి, జోర్హత్ జిల్లాల అధికారులను ఆదేశించారు.