మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌లోని నవాబుపేట మండలం ఇప్పటూరులో ఈ ఘటన జరిగింది. చిన్నారులు గడ్డివాము వద్ద ఆడుకుంటుండగా ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
గడ్డివాము వద్ద చిన్నారులు రోజు ఆడుకుంటారు. కానీ అక్కడికి మంటలు ఎలా వచ్చాయి… ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా… ప్రమాదవశాత్తు మంటలు వచ్చాయా… అన్నది తేలాల్సి ఉంది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.