వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యాచార నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు అనే వార్త సంచలనం రేపుతోంది. ఆ నలుగురు ఎన్‌కౌంటర్ కావటం, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో… ఆ ఇద్దరు మైనర్లేనన్న విషయం బయటకు వచ్చింది. నిందితుల్లు జొల్లు శివ, చెన్నకేశవులు ఇద్దరూ మైనర్లేనని వారు చదువుకున్న బోనఫైడ్స్ కూడా రుజువు చేస్తున్నాయి.
ఓ వైపు ఫేక్ ఎన్‌కౌంటర్ అన్న ఆరోపణలు, మరోవైపు మానవ హక్కుల కమీషన్ కేసును సుమోటోగా స్వీకరించటంతో కుటుంబ సభ్యులు మా బిడ్డలను తప్పు రుజువుకాకముందే చంపేశారంటూ ప్రశ్నించారు.
చెన్నకేశవులు స్కూల్లో నమోదైన వివరాల ప్రకారం.. 10.04.2004న చెన్నకేశవులు జన్మించారు. అంటే… చనిపోయే నాటికి చెన్నకేశవులు వయస్సు 15 సంవత్సరాల 8 నెలలు.
ఇక మరో నిందితుడు జొల్లు శివ పుట్టిన తేదీ స్కూల్లో నమోదు చేసినదానికి, ఆధార్ కార్డ్‌కు తేడా ఉంది. స్కూల్ వివరాల ప్రకారం 15.08.2002గా ఉంది. అంటే 17 సంవత్సరాలు వయస్సు కానీ ఆధార్‌లో మాత్రం 2001లో పుట్టినట్లుగా పేర్కొన్నారు.
అత్యాచారం చేస్తే ఇక పై ఉరిశిక్ష