కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు విద్యార్థినిలు తరచూ అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు. కళాశాలలో పనిచేస్తున్న వార్డెన్ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థినిలు గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. అందులో ఒకరు రెండునెలల క్రితమే గర్భం దాల్చినట్లుగా వైద్యులు తెలిపారు.
వసతిగృహం సిబ్బంది, ప్రిన్సిపల్ … ఆ విషయాన్ని ఎందుకు ఇన్నిరోజులు గుట్టుగా ఉంచారన్న విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు గర్భందాల్చిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేయనున్నారు. ఏఎన్‌ఎం, ప్రిన్సిపాల్ , జిల్లా గిరిజన అధికారుల సమక్షంలో విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి వివరాలు సేకరించనున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలుచేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.