ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కృషికుమార్, ధర్మధీర్ అదృశ్యం అయిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటివద్ద ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా అదృశ్యం అవ్వటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంటి చుట్టూ వెతికినప్పటికీ ఎక్కడ ఆచూకీ కనిపించలేదు. ఎంత వెతికిన పిల్ల ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. పిల్లల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.