బీమా అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరం. తమకు ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే బీమా చేసుకుని ఉండాల్సిందే. ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవించినా…. ఆసుపత్రి ఖర్చులకోసం కావాలన్నా బీమా తప్పనిసరి చేసుకుని ఉండాలి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మంచి బీమా స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ బీమా ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకు మరియు పాక్షిక అంగవైకల్యం పొందిన వారికి వర్తిస్తుంది. సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారు ప్రతి ఏడాది కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అకాల మరణానికి లేదంటే శాశ్వతంగా వైకల్యానికి గురైనట్లయితే రెండు లక్షల జీవిత బీమాను ఈ పథకం ద్వారా పొందవచ్చు. అంతే కాకుండా శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యానికి గురైతే ఒక లక్ష రూపాయల బీమా ను అందిస్తుంది.
అయితే సురక్ష బీమా యోజన పథకానికి అప్లై చేసుకునేవారికి 18 నుండి 70 ఏళ్ల వయసు మధ్య ఉండాల్సి వస్తుంది. అంతే కాకుండా బ్యాంకు లో ఖచ్చితంగా సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు. ఏడాదికి పన్నెండు రూపాయలు అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బీమాకు అప్లై చేసుకోవచ్చు.