ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టులో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు లాయర్లకు గాయాలయ్యాయి. పేలుడు జరిగిన తర్వాత మూడు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లక్నో బార్ అసోషియేషన్ సీనియర్ మెంబర్ లక్ష్యంగా లాయర్ల చాంబర్ లోకి బాంబు విసిరినట్టు తెలుస్తోంది. కోర్టుకు కిలో మీటర్ దూరంలోని హజ్రత్ గంజ్ లో ఉన్న కలెక్టరేట్ సమీపంలో కూడా పేలుళ్లు జరిగినట్టు తెలిసింది.జితూ యాదవ్ అనే లాయర్ తనను టార్గెట్ గా చేసుకొని బాంబు విసిరినట్టు లక్నో బార్ అసోషియేషన్ జాయింట్ సెక్రెటరీ సంజీవ్ లోది ఆరోపించారు.