డిసెంబర్ 25 న ఢిల్లీలో ఇద్దరు డాక్టర్లు అదృశ్యం అయిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఆ ఇద్దరు డాక్టర్లను పోలీసులు సిక్కింలో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే భార్యభర్తలైన శ్రీధర్, హిమబిందు వృత్తి రీత్యా డాక్టర్లు. ఇద్దరు కూడా ఢిల్లీలోనే పనిచేస్తున్నారు. అయితే వీరితో కర్నూల్ కాలేజీ లోనే కలిసి చదువుకున్న దిలీప్ చండీగఢ్ లో పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చిన దిలీప్ హిమబిందు ఇంటికి వచ్చాడు. క్రిస్మస్ రోజు ఈ ఇద్దరు చర్చ్ కి వెళ్లివస్తామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తరువాత ఈ ఇద్దరి ఫోన్ లు స్విచ్ ఆఫ్ రావటంతో భర్త శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిమబిందు, దిలీప్ ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ద్వారా సిక్కింలో ఉన్నట్టు గుర్తించారు.
పూర్తి వివరాలు విచారణ తర్వాత ప్రకటిస్తామన్నారు పోలీసులు. అందరూ తెలుగువారే కావటంతో ప్రేమ కోణం ఎదైనా ఉందా…? సిక్కిం ఎందుకు వెళ్లారు అని పోలీసులు విచారిస్తున్నారు.