కాబూల్‌ను తాలిబన్ దళాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ కు వేల మంది ఎగబడ్డారు. ఓ ఇద్దరైతే ఫ్లైట్ చక్రానికి తమను తాము కట్టుకున్నారు. కానీ..ఫ్లైట్ ఎగిరిన కాసేపటికే పిట్టల్లా రాలిపోయారు. ఇందుకు సంబంధించిన హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాలిబాన్లు కాబూల్‌కు చేరారని తెలిసినప్పటి నుంచి ఆఫ్ఘాన్‌వాసులు తల్లడిల్లిపోతున్నారు. వారికి చేతికి చిక్కకూడదని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగుదేశాలకు పరుగులు తీస్తున్నారు. ఈక్రమంలో వేలాది మంది కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై పడ్డారు. విమానాల్లో స్థలం లేకపోయినా సరే.. ఏదో ఒక విధంగా దాని సాయంతో అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నారు. ఈక్రమంలో రన్‌వేపై విమానం పరుగులు తీస్తున్న సమంలోనూ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. విమానం రెక్కలు, టైర్లు ఉండే ప్రదేశంలోనూ ఏదో విధంగా సర్దుకుని ప్రయాణం చేసే సాహసం చేస్తున్నారు. అలా చేస్తూ ఆ ఇద్దరు విమానం నుంచి కిందపడిపోయారు.
Chaotic scenes have been seen at Kabul airport as hundreds of people seek to escape on evacuation flights.
Follow live updates on the situation in Afghanistan here: https://t.co/peE7xTqd37 pic.twitter.com/TO0JHyLTxI
— Sky News (@SkyNews) August 16, 2021
Advertisements