జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ కంపెనీలో పేలుడు సంభవించింది. కంపెనీలో ఉన్న రియాక్టర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల చిక్కుకున్న ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
పేలుడు దాటికి కంపెనీ పైకప్పు తునాతునకలు అయింది. ఒక్కసారిగా చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ రసాయనాల పొగలు అలుముకున్నాయి. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.