ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా కాదేనార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
బస్తర్ ఐజీ సుందర్ రాజన్ ఈ ఘటనను ధృవీకరించారు. ఎన్ కౌంటర్ లో ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ షిండే, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గుర్ముఖ్ సింగ్ మరణించినట్లు చెప్పారు. మావోయిస్టులు ఏకే 47తోపాటు రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాకీ టాకీలను తీసుకుని పారిపోయారని తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని వివరించారు.