జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. కుప్వారా జిల్లాల్లో ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది.
జిల్లాలోని జుమాగండ్ ప్రాతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో సైన్యంతో కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఓ ఇంట్లో తలదాల్చుకున్న ఉగ్రవాదులు పోలీసుల రాకను గమనించి వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.
ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వీరితో పాటు ఓ సాధారణ పౌరుడు కూడా మరణించినట్టు ఆయన పేర్కొన్నారు.
మృతులను షకీర్ అహ్మద్ వాజా, అఫ్రీన్ అఫ్తాబ్ మాలిక్‌గా గుర్తించినట్టు ఐజీ వివరించారు. టీవీ నటి అమ్రీన్ భట్ హత్యతో వీరికి సంబంధం ఉన్నట్టు తెలిపారు.