హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా 60 సంవత్సరాల యాచకురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన మల్కాజ్ గిరి లో చోటుచేసుకుంది.
ఈ నెల 17 ఫుల్ గా మద్యం సేవించిన 50ఏళ్ల వయస్సున్న చిన్నప్ప, 53 ఏళ్ల వయస్సున్న నేనావత్ లు రోడ్ మీద కూర్చుకున్న యాచకురాలి పై కన్నేశారు. ఆమె ను మొదట మాటల్లో దించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించారు. ఆ యాచకురాలు స్పృహ కోల్పోయిన తరువాత ఆమె పై అతయచరానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన తరువాత గట్టిగ కేకలు వెయ్యటంతో ఇద్దరు పరారయ్యారు. ఇద్దరి నిందితులను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.