కేరళలో దారుణం చోటు చేసుకుంది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని అత్యాశకు పోయారు దంపతులు, మరో వ్యక్తి. దాని కోసం కొచ్చికి ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతి పెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, అతని భార్య లైలా ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తోడయ్యాడు. మహ్మద్ షఫీ.. సోషల్ మీడియాలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు.
వారికి మాయ మాటలు చెప్పి తన వద్దకు రప్పించుకున్నాడు. అనంతరం వారిద్దరిని సెప్టెంబరు 26న కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు.
ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను పద్మం (52), రోస్లి(50)గా గుర్తించారు.