తాను మరణిస్తూ ఐదుగురిని కాపాడింది ఓ రెండేళ్ల చిన్నారి. అవయవదానం ద్వారా ఐదుగురికి పునర్జన్మనిచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన రెండు సంవత్సరాల వయస్సున్న కొడుకు అవయవాలు దానం చేశారు. తాము పడుతున్న కడుపుకోత ఇతరులు పడకుండా సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు.
గుజరాత్‌కు చెందిన జర్నలిస్ట్ సంజీవ్ ఓజా దంపతులకు యష్ ఓజా అనే కొడుకున్నాడు. బుడి బుడి అడుగులతో ఆడుకుంటూ ఆ అబ్బాయి ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుండి కింద పడిపోయాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తమ బాబు మరణించినా బ్రతికే ఉండాలన్న ఆ జర్నలిస్ట్ దంపతులు… యస్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. యష్ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి, ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో చిన్నారికి, అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను, భావ్‌నాగర్‌కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్ లివర్‌ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు.
ఇలా తాను మరణిస్తూ యష్ మరో ఐదుగురిని కాపాడాడు.