హయత్ నగర్ లో మహిళ మృతదేహాన్ని తరలిస్తూ దొరికిపోయారు ఇద్దరు యువకులు. తొర్రూరు రోడ్డులోని బాతుల చెరువు సమీపంలో జరిగిందీ ఘటన. డెడ్ బాడీని ఓ బ్లాంకెట్ లో చుట్టి తీసుకెళుతుండగా స్థానికులు గమనించారు. వారిద్దరినీ పట్టుకుని నిలదీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి చితకబాది పోలీసులకు అప్పగించారు.
మహిళను హత్య చేసి తరలిస్తున్నట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే ఇద్దరిలో వినోద్ అనే వ్యక్తి తమది లవ్ మ్యారేజ్ అని… తన భార్య చనిపోయిందని చెప్పాడు. కానీ.. ఎలా చనిపోయిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పోలీసులు తమదైన స్టయిల్ లో విచారణ జరుపుతున్నారు. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.