గోధుమలపై నిషేధం విషయంలో భారత్ పునరాలోచిస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్ నిర్ణయం ‘ప్రస్తుత ప్రపంచ ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని అమెరిక రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ పేర్కొన్నారు.
‘ భారత నిర్ణయం గురించి నివేదికను మేము చూశాం. ఎగుమతులపై నిషేధం విధించకూడదని మేము కోరుతున్నాము. ఒక వేళ నిషేధం విధిస్తే ప్రపంచం వ్యాప్తంగా ఆహార కొరత మరింత ఎక్కువ అవుతుంది. ఇతర దేశాల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నాము’ అని తెలిపారు.
జీ7 దేశాల వ్యవసాయ మంత్రులు కూడా భారత నిర్ణయంపై శనివారం స్పందించారు. గోధుమల ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ మార్కెట్లను మూసివేస్తే సంక్షోభం మరింత తీవ్రమవుతుందన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల గోధుమల ధరలు పెరిగాయి.
మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గోధుమల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. భారత్‌లోనూ రేటు పెరిగింది. ఇండియాలోనూ ధరలు పెరిగాయి. దీంతో ఎగుమతులపై నిసేధం విధించడంతో ధరలు తగ్గాయి.