ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం ప్రకటించింది. వారంలో నాలుగున్నర రోజులే పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. కానీ ఉద్యోగుల్లో పని ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలను నుండి ఆదివారం వరకు ఈ వారాంతపు సెలవులు ఉంటాయని యూఏఈ తెలిపింది. ఇది 2022,జనవరి 1 నుండి అమల్లోకి వస్తోందని వెల్లడించింది. దీంతో అక్కడి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.