విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్ కావాల్సిందే. పాస్ పోర్ట్ లేకుండా వేరే దేశానికి వెళ్లడం చట్టరీత్యా నేరం. అయితే అన్ని దేశాల పాస్ పోర్ట్స్ కి ఒకే విలువ ఉండదు. వాటికి కూడా ర్యాంక్స్ ఉంటాయి. ర్యాంకుల ఆధారంగా దేని విలువ ఎంతో నిర్ణయిస్తారు. ఈ ఏడాది కూడా ర్యాంకులు వచ్చేశాయి. ఆర్టన్ క్యాపిటల్ ఆ జాబితాను రిలీజ్ చేసింది.
అయితే పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌కు 94వ ర్యాంక్ వచ్చింది. సోమాలియా కూడా ఆ ర్యాంక్‌లోనే ఉంది. ఇక అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న దేశాల్లో యూఏఈ టాప్ ప్లేస్‌లో నిలిచింది. పాక్ పాస్ పోర్ట్ తో ఎటువంటి వీసా లేకుండా కేవలం 44 దేశాలకు మాత్రమే వెళ్లే వీలు ఉంది.
పాక్ కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న దేశాల్లో ఇరాక్(95), సిరియా(96), ఆఫ్ఘనిస్తాన్(97) దేశాలు ఉన్నాయి. యెమెన్, బంగ్లాదేశ్, నార్త్ కొరియా, లిబియా, పాలస్తీనా, ఇరాన్ దేశాల పాస్ పోర్ట్ లు పాక్ కన్నా పవర్ ఫుల్ అని తేలింది.
యూఏఈ దేశానికి చెందని పాస్ పోర్ట్ తో ఎటువంటి వీసా లేకుండా అత్యధికంగా 180 దేశాల్లో ప్రయాణం చేయవచ్చు. నెదర్లాండ్స్, ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల పాస్ పోర్ట్ లో 173 దేశాల్లో విజిట్ చేయవచ్చు. అమెరికా, పోలాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, నార్వే పాస్ పోర్ ట్‌లతో 172 దేశాలకు వెళ్లవచ్చు.