ప్రస్తుతం చాలా కంపెనీలలో పని చేస్తున్న వాళ్లందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పనిసరి. అది చిన్న ఉద్యోగులైనా, పెద్ద ఉద్యోగులైనా పిఎఫ్ అకౌంట్ ఉండాల్సిందే. అయితే అందులో ఉన్న డబ్బులు తీసుకోవడానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. కంపెనీ చెల్లించే పిఎఫ్ అయితే ఓనర్ సైన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే EPFO తాజా సమాచారం ప్రకారం UAN, KYC వివరాలతో మ్యాచ్ అయితే లేదా లింక్ చేస్తే కంపెనీ యజమాని జోక్యం లేకుండా నేరుగా వివిధ ఆన్‌లైన్ సేవలను అనుకునే సౌలభ్యం కలుగుతుంది పిఎఫ్ మెంబెర్ కు. సాధారణంగా ఒక కొత్త కంపెనీ లో చేరినప్పుడు ఎంప్లాయ్ తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇప్పటికే కేటాయించిన యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ మెంబర్ కు కొత్త అసైన్డ్ మెంబర్ ఐడెంటిఫికేషన్ నంబర్ మార్క్ చేయడానికి కంపెనీకి సహాయపడుతుంది.
UAN అంటే ?
UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇది ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా మెంబర్స్ కు ఇచ్చే 12 అంకెల సంఖ్య. పిఎఫ్ సభ్యుల మెంబర్ ఐడిని ఒకే యూనివర్సల్ అకౌంట్ నంబర్‌కి లింక్ చేయడానికి ఈ నంబర్ ఇస్తారు.
KYC అంటే ?
ఉద్యోగులు, కంపెనీ యజమానులు నిరంతరాయంగా ఆన్‌లైన్ లో పిఎఫ్ సేవలను అందుకోవడానికి ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేస్తారు. దానికి ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైన KYC వివరాలను అందించాలి. KYC వివరాలతో UAN ని లింక్ చేయడం ద్వారా సబ్ స్క్రైబర్ల గుర్తింపును యూనిక్ గా చేస్తారు.
UAN కు సంబంధించి KYC వివరాలు పూర్తి చేయాలంటే :
1: EPF ఖాతాకు లాగిన్ అవ్వండి – https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
2: ‘మేనేజ్’లో ‘KYC’ ఎంపిక చేయండి
3: మీరు మీ UAN తో లింక్ చేయాలనుకుంటున్న వివరాలను (PAN, బ్యాంక్ ఖాతా, ఆధార్, మొదలైనవి) ఎంచుకోండి.
4: అవసరమైన వివరాలతో ఆ ఫామ్ ను ఫిల్ చేయండి.