తెలుగు సినిమాలో కొందరు హీరోలను మనం ఎప్పటికి మరువలేం. అందులో ఉదయ్ ముందు వరుసలో ఉంటాడు అనే చెప్పాలి. ఉదయ్ కిరణ్ సినిమాల కోసం అమ్మాయిలు అప్పట్లో పెద్ద ఎత్తున హాల్స్ కి వెళ్ళే వాళ్ళు. మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఎందరో ఎదురు చూసారు. అయితే కొన్ని కారణాలతో చాలా సినిమాలు ఆగిపోయాయి. ఆ సినిమాల జాబితా ఏంటో ఒకసారి చూద్దాం.

Also Read:షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన చిరంజీవి సినిమాల లిస్ట్ ఇదే ఒక లుక్ వెయ్యండి !
ఎంఎన్ రత్నం సినిమా
ఈ సినిమాను ఉదయ్ కిరణ్ చేసి ఉంటే అతని కెరీర్ మరో రేంజ్ లో ఉండేది. కాని కొందరి ప్రముఖుల ఒత్తిడి తో ఆ సినిమా ఆగిపోయింది. 80 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను సడెన్ గా ఆపేశారు.
అంకిత, ఉదయ్ కిరణ్ కాంబో
ప్రత్యూష క్రియేషన్స్ లో వీరు ఇద్దరూ సినిమా చేయాల్సి ఉంది. కాని అనూహ్యంగా ఆ సినిమా ఆగిపోయింది. షూటింగ్ కి వెళ్ళే ముందే ఆ సినిమా ఆగిపోయింది.
పూరి జగన్నాథ్ సినిమా
ఆసిన్ హీరోయిన్ గా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కాని ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్ళలేదు. ఈ సినిమా చేసి ఉంటే ఉదయ్ కిరణ్ కు మరో ఇమేజ్ వచ్చి ఉండేది.
నర్తనశాల
బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ అయిన నర్తన శాల సినిమాలో అభిమన్యు పాత్రకు గాను ముందు ఉదయ్ కిరణ్ ను అనుకున్నారు. కాని ఆ సినిమా కూడా ముందుకు వెళ్ళలేదు. సౌందర్య మృతి తో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. ఆమె ఈ సినిమాలో సీత పాత్ర చేయాల్సి ఉంది.
జబ్ వీ మెట్ రీమేక్
హిందీలో కరీనా, షాహిద్ చేసిన జబ్ వీ మెట్ సినిమాను తెలుగులో త్రిష, ఉదయ్ కిరణ్ తో రీమేక్ చేయాలని చూసారు. ఈ సినిమా కూడా అనివార్య కారణాలతో ముందుకు వెళ్ళలేదు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ సినిమా
ఉదయ్ కిరణ్ హీరోగా సదా హీరోయిన్ గా ఒక సినిమా చేయాల్సి ఉంది. కాని ఈ సినిమా కూడా షూట్ కి వెళ్ళలేదు. మంచి రొమాంటిక్ సినిమాగా ఇది ముందుకు వెళ్ళాల్సి ఉంది.
ఆది శంకరాచార్య
ఆది శంకరా చార్య సినిమాను కూడా ఉదయ్ కిరణ్ చేయాలనుకున్నాడు. కాని ఆర్ధిక ఇబ్బందులతో ఈ సినిమా అప్పట్లో ఆగిపోయింది.
ఎమ్మెస్ రాజు సినిమా
అప్పటికే ఉదయ్ కిరణ్ తో రెండు సినిమాలు చేసిన రాజు మరో సినిమాను ప్లాన్ చేసారు. మనసంతా నువ్వే, నీ స్నేహం సినిమాలు హిట్ కావడంతో మరో సినిమా ప్లాన్ చేస్తే… కారణాలు ఏంటో తెలియకుండా సినిమా ఆగిపోయింది.
చంద్రశేకర్ యేలేటి
మిలటరీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను చంద్రశేకర్ ప్లాన్ చేసారు. ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ మిలటరీ అధికారిగా చేయాల్సి ఉంది. కాని ఆ సినిమా కూడా ఆగిపోయింది.
తేజా తో సినిమా
ఉదయ్ కిరణ్ కష్టాలలో ఉన్నప్పుడు తాను సినిమా చేస్తాను అని… నిర్మాతగా కూడా వ్యవహరిస్తాను అని దర్శకుడు తేజా ముందుకు వచ్చారు. కాని ఆ సినిమా ముందుకు వెళ్ళకుండా ఆగిపోయింది. అప్పుడే ఉదయ్ కిరణ్ మరింత ఒత్తిడిలోకి వెళ్ళాడు.
Also Read:నిర్మాత, హీరోపై చీటింగ్ కేసు