తెలంగాణ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ధర్శించుకోవడానికి భక్తులు, వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీశ్రీ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం నాడు ఉద్దాల మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు అదిక సంఖ్యలో హజరవుతారు.
కలియుగ ప్రత్యక్ష దైవం కొలిచినవారికి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి రూపం, పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కు సర్వం సిద్ధం అయ్యాయి.
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో సప్త కొండలపై కొలువుదీరిన శ్రీ కురుమూర్తి స్వామి వారికి నేటి నుంచి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. నవంబర్ 1వ తేదీన అలంకరణ మహోత్సవం జరిగింది.నేడు ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం జరుపుతారు. లక్షలాదిమంది భక్తజనం ఈ ఉద్దాల ఉత్సవంలో పాల్గొని స్వామివారి పాదుకలను తాకేందుకు సిద్ధమవుతారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడు వద్ద చేసిన అప్పును తీర్చలేక తిరుమల కొండ నుంచి అమ్మాపూర్ గ్రామం సమీపంలో కాంచన గుహలో తలదాచుకుని శిలగా మారి పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అతి పురాతనమైన దేవాలయాల్లో కురుమూర్తి క్షేత్రం ఒకటి. దాదాపు నాలుగు వందల యేండ్ల క్రితం, కాంచన గుహలో కొలువుదీరిన స్వామికి ఆనాటి నుండి ముక్కెర వంశ రాజులు పూజించి తరిస్తున్నారు. ఏడుకొండలపై వెలసి ముక్కోటి భక్తుల కోరికలు తీర్చే తిరుమల తిరుపతి ప్రతిరూపమే శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి అని ఆ ప్రాంత ప్రజలు భావిస్తారు. అప్పటి నుంచి ముక్కెర వంశీయులు గుట్టపైకి వెళ్లేందుకు మెట్ల దారి నిర్మించి ప్రతి ఏడాది జాతరను నిర్వహిస్తూ ఉండేవారు ఆత్మకూరు సంస్థానాధీశుల ఆరాధ్యంగా వెలుగొందుతూ తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా స్వామి మొక్కులు అందుకుంటున్నారు.
ముక్కెర రాజవంశీయులు కోట్లాది రూపాయలు విలువచేసే ముత్యాలు పగడాలు, కెంపులు, పచ్చలు, వజ్రాలు వైడూర్యాల తో చేయించిన ఏడువారాల నగలను, కానుకగా సమర్పించుకున్నారు, కాలానుగుణంగా ఆ ఆభరణాలను ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో భద్రపరుస్తూ వస్తున్నారు.
శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నేడు కన్నులపండుగగా కొనసాగుతుంది. లక్షలాదిమంది జనసందోహం మధ్య స్వామివారి ఉద్దాల ఉత్సవం వడ్డేమాన్ గ్రామం నుండి కురుమూర్తి స్వామి గుట్టకు చేరుకుంటుంది
.