మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే రేపు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివాజీ పార్క్ వేదిక కానుంది. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఈరోజు ఉదయం గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసి ఈ విషయం తెలియజేశారు. శివసేన ఐదు దశాబ్ధాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏనాడు ఠాక్రేలు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించలేదు. ఠాక్రేలో కుటుంబంలో ఉద్ధవ్ ఠాక్రే మొదటి ముఖ్యమంత్రి కాబోతున్నారు. డిప్యూటీ సీఎం ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. స్పీకర్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు చర్చిస్తున్నాయి.