తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఏటా జరిగే బోనాలు. ఆడబిడ్డలు అందంగా ముస్తాబై…బోనంతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల ఫ్లేవర్‌ను సినిమాల్లో చూపించేందుకు రెడీగా ఉంటారు దర్శకులు.
ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు హైలెట్‌గా నిలిచాయి.వాటిల్లో ఒకటి రీసెంట్‌గా రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన విరాటపర్వం . ఈ చిత్రంలో డైరెక్టర్ వేణు ఊడుగుల బోనాల సన్నివేశాలతో తెలంగాణ ముఖ చిత్రాన్ని కండ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన సాయిపల్లవి లంగావోణిలో తెలుగుదనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొని వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి.నేడు బోనాల సందడి ఉండటంతో.. విరాటపర్వం సినిమాలోని స్టిల్స్ ను షేర్ చేస్తూ..అందరికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు వేణు ఊడుగుల.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!..అంటూ ట్వీట్ చేశారు. ఇపుడీ ట్వీట్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!#Happybonam pic.twitter.com/wSVxr0yvJj
— v e n u u d u g u l a (@venuudugulafilm) July 24, 2022
Advertisements