కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని కలెక్షన్లు రాబట్టింది. అన్ని భాషలు వారు ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. దక్షిణ కన్నడ తీర ప్రాంతంలోని జానపద కథాంశాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సన్నివేశం.. యథార్ధంగా జరగడంతో ప్రస్తుతం మరోసారి కాంతారా మూవీ చర్చనీయాంశమైంది.
కోస్టల్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని పడుబిద్రి అనే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 500 ఏళ్ల నాటి జారందయ దేవాలం వివాదానికి సంబంధించినది. ఆలయ నిర్వహణ విషయంలో రెండు కమిటీల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. అయితే, కేసుకు సంబంధించిన వ్యక్తి కాంతారా చిత్రంలో ఒక దేవత శాపానికి గురై కోర్టు మెట్ల పై చనిపోవడాన్ని పోలి ఉంది.
ఆ వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లే మార్గంలో మరణించాడు. పాడుబిద్రి జారందాయ ఆలయ నిర్వహణ బాధ్యత బంట సేవా సమితి పై ఉంది. ఈ సేవాసమితి సభ్యుల పునర్వ్యవస్థీకరణ తర్వాత పోరాటం ఉదృతమైంది. ఈ కేసులో అధికారం కోల్పోయిన ప్రకాశ్ శెట్టి తర్వాత ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆర్చర్ అయిన జయ పూజారిని ట్రస్టు చైర్మన్ గా నియమించారు.
ఈ కేసులో ప్రతివాదులు మందిరం పై తమ అధికారాన్ని చాటుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.గందరగోళం నేపథ్యంలో ప్రకాష్ శెట్టి , స్పీకర్ జయ పూజారి కోర్టుకు చేరుకున్నారు. అయితే జయ పూజారి డిసెంబర్ 24న కోర్టుకు వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో మరణించారు.
కాంతారా సినిమా చూసిన వారు ఈ ఘటనను సినిమాతో పోలుస్తున్నారు. ఈ చిత్రంలో, ఒక రాజు వారసులు గ్రామస్థులతో ఉనన భూ వివాదం పై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే వారు గ్రామానికి రక్షకుడిగా భావించే పంజుర్లి దేవ్ చేత శపించబడ్డారు. ఫలితంగా కోర్టు మెట్ల పై పడి వంశీకులు చనిపోతారు.