కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. హిజాబ్ ధరించడం మత పరంగా తప్పని సరి కాదని హైకోర్టు తెలిపింది.
హిజాబ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్దిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. విద్యా సంస్థల ప్రోటోకాల్స్ ను స్టూడెంట్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు హిజాబ్ పై అన్ని పిటిషన్లనూ కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.
హైకోర్టు నిర్ణయంపై ఉడిపి విద్యార్థులు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు సుప్రీం కోర్టు న్యాయవాది అనాస్ తన్వీర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవానం ఓ ట్వీట్ చేశారు.
‘ ఉడిపిలో హిజాబ్ విషయంలో నేను నా క్లైంట్ లను కలిశాను. వారు ఈ విషయంలో త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. ఆ విద్యార్థులు హిజాబ్ ధరించే తమ హక్కును ఉపయోగించుకుంటూనే తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. వీరు దేశ రాజ్యాంగం, న్యాయ స్థానాలపై నమ్మకం కోల్పోకూడదు” అని ట్వీట్ చేశారు.