‘ఉగాది’.. తెలుగు వారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా చెప్తారు. ఎంతో సాంప్రదాయకంగా భావించే ఉగాది.. యుగ, ఆది అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అంటే యుగం ప్రారంభం అని అర్థం వస్తుంది. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఏపీ, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు. ఈ పండుగ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలతో, పూలతో, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఇష్టదైవాన్ని పూజిస్తారు. అనంతరం దీప, ధూప, నైవేద్యాలే కాకుండా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రధానంగా నివేదించి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
ఈ పండగ ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి’.. ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఈ ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ పచ్చడి మన జీవితంలోని భావోద్వేగాలను సూచిస్తుందని పెద్దలు అంటారు. అందుకే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చెప్తారు.
ఉగాది పచ్చడిలో ఉపయోగించే తీపి పదార్థాలు బెల్లం, అరటిపండు ఆనందాన్ని.. చేదుగా ఉండే వేప పువ్వు దు:ఖాన్ని.. కారంగా ఉండే పచ్చిమిర్చి కోపాన్ని.. ఉప్పగా ఉండే ఉప్పు ఉత్సాహాన్ని.. పుల్లగా ఉండే చింతపండు నేర్పును.. వగరుగా ఉండే మామిడి కొత్త సవాళ్లను సూచిస్తాయి. ఈ ఉగాది పచ్చడితో రుచులనే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాల్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఇక ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. అంటే నేటితో శ్రీ ప్లవ నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరం అయిన శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈసారి తెలుగు సంవత్సరం పేరులోనే శుభాన్ని మోసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఉగాది పండగ హడావిడి కన్పిస్తోంది. సెలెబ్రిటీలంతా ట్విట్టర్‌లో తమ అభిమానులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
‘అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను’ అంటూ మెగస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఉగాది శుభాంకాలు తెలిపారు.
అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐 pic.twitter.com/oFmh1H8IWQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022
‘మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ చేశారు.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi.
— Jr NTR (@tarak9999) April 2, 2022
‘ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.’ అంటూ హీరో కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.
అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 2, 2022
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#ugadi2022 pic.twitter.com/4LtXx9FCjR
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022
Ugadi Subhakankshalu 😊
Here's to new hope and happiness in abundance! Have a delightful one… #HappyUgadi— Sudheer Babu (@isudheerbabu) April 2, 2022
Wishing you all a #HappyUgadi.
Love..#RAPO #TheWarriorr #TheWarriorrOnJuly14 pic.twitter.com/mrZZwB0lle
— RAm POthineni (@ramsayz) April 2, 2022
Advertisements