గాంధీభవన్ లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వేద పండితులు చిలుకూరు శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
కాగా.. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు.. కొందరు కాంగ్రెస్ నేతలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉగాది ప్రజల కష్టాలను దూరం చేయాలని కోరుకుంటున్నానన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏ లక్ష్య సాధనలో భాగంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారో.. ఆ దిశగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదులో 40 లక్షలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ ముగ్గురు మహిళల సారథ్యంలో ఏర్పడిందని.. కానీ.. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు.
గాంధీ భవన్ లోని ఉగాది వేడుకలకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెండ్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ లతో పటు.. పలువురు ఏఐసీసీ నేతలు హాజరయ్యారు.