పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దర్శకుడు, నటుడు సముద్రఖని డైరెక్ట్ చేయనున్నారు. ఇదే వార్త గత కొన్నిరోజులు గా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఉగాదికి ఘనంగా స్టార్ట్ కాబోతుందట . ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మొదట ఇది రీమేక్ గా అందరూ భావించారు కానీ దీనిని మేకర్స్ పూర్తిగా మార్చేసారట. అంతే కాకుండా పవన్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందట.
ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో దర్శకనిర్మాతలు బిజీగా ఉన్నారట. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని పీపుల్డ్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది.
ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అలాగే క్రిష్ తో హరి హర వీర మల్లు, హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్‌ని సినిమాలు చేస్తున్నాడు.