తూర్పు ఆఫ్రికా లోని ఓ దేశం ఉగాండా! దీని రాజధాని కంపాలా. ఉగాండా ప్రపంచం లోనే ఇథియోపియా తర్వాత రెండవ అతి పెద్ద భూపరివేష్టిత దేశం. ఉగాండా బ్రిటీషు నుండి 1962 అక్టోబరు 9 న స్వాతంత్ర్యం పొందింది.
ఉగాండా దేశ విశేషాలు…అక్కడి వింతలు!!
- ఉగాండా దేశంలో లోకల్ కరెన్సీని ఉగాండా షిల్లింగ్ (యూజీఎక్స్) అని పిలుస్తారు. 1 అమెరికన్ డాలర్‌కు సుమారుగా 3,600 షిల్లింగ్స్ వస్తాయి.
- ఉగాండాలో మొబైల్ డేటా ప్యాకేజ్‌లు చాలా చీప్ ధరలకే లభిస్తాయి. 10 జీబీ డేటా ధర 10 డాలర్ల లోపే ఉంటుంది. అయితే ఉగాండాకు వెళ్లగానే మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆ పనిచేసే వారు లభిస్తారు.
- ఉగాండాలోని జింజా అనే ప్రాంతానికి పర్యాటకులు వెళ్లవచ్చు. అక్కడి అడ్రిఫ్ట్, నైల్ రివర్ ఎక్స్‌ప్లోరర్ (ఎన్ఆర్ఈ) క్యాంప్‌లకు పర్యాటకులు ఎక్కువగా వెళ్తారు. ఆ క్యాంప్‌లలో పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చు.
- ఈ దేశంలో చిన్నారులకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా వారిని అనాథలుగా పిలుస్తారు.
- వీరు వేసవిలో జీఎంటీ + 2కు అనుగుణంగా, చలికాలంలో జీఎంటీ + 3కి అనుగుణంగా సమయం పాటిస్తారు.
- ఇక్కడ బీర్‌ను అర లీటర్ బాటిల్స్‌లో విక్రయిస్తారు. ధర 2 డాలర్లలోపే తక్కువగా ఉంటుంది.
- రోజూ రాత్రి 10.30 గంటలు అయ్యే సరికి రియల్ ఉగాండా వాలంటీర్ గెస్ట్ హౌజ్ సెక్యూరిటీ గేట్‌ను లాక్ చేస్తారు.
- ఈ దేశంలో మలేరియా దోమలు ఎక్కువగా ఉంటాయి.
- రియల్ ఉగాండా వాలంటీర్లు తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కనుక పర్యాటకులు తమతో ఎలక్ట్రోలైట్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ ప్యాకెట్లను తీసుకెళ్తారు.
- ఉగాండాలో రోస్ట్ పోర్క్ ఫేమస్ వంటకం.
- ఇక్కడ గొరిల్లాలను చూడాలంటే 600 డాలర్లు చెల్లించాలి. ఉగాండా వైల్డ్ లైఫ్ అథారిటీ నుంచి పర్మిషన్ ఉండాలి.
- ఈ దేశంలో హాయ్ అనకూడదు. హౌ ఆర్ యు అనాలి.