యూజీసీ నెట్ 2021 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఆధ్యర్యంలో మే 2 నుంచి 17 వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
11 రోజలపాటు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు ugcnet.nta.nic.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.