పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన హింసాత్మకంగా మారుతున్న నేపధ్యంలో భారత్ వెళ్లే తమ దేశీయులకు అమెరికా, బ్రిటన్ దేశాలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. నిన్న మొన్నటి వరకు ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన నిరసనలు ఇప్పుడు ఢిల్లీ, మిగతా రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. గువహటిలో కర్ఫ్యూ విధించారు. మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేశారు.