భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద నిపుణులైన భారతీయ యువతకు ఆహ్వానం పలుకుతున్నట్టు పేర్కొంది. ఈ పథకం కింద 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అర్హులైన భారతీయ యువతకు 2,400 వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ పథకం కింద వీసా పొందేందుకు అభ్యర్థులు ముందుగా బాలెట్ దశలో ఎంపిక కావాల్సి వుంటుంది. బాలెట్ నమోదు కోసం ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీనికి ఉచితంగానే నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది.
బాలెట్ దశలో ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. అప్పుడు దరఖాస్తులను పరిశీలించి వీసా మంజూరు చేశారు. వీసా మంజూరైన ఆరు నెలల్లోగా అభ్యర్థులు బ్రిటన్ కు వెళ్లిపోవాల్స వుంటుంది.
మొదటి దఫాలో వీసాలు పొందలేకపోయిన వారికి రెండో బాలెట్ ద్వారా ప్రయత్నించవచ్చని చెప్పింది. బ్రిటన్- భారత ప్రభుత్వాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం….బ్రిటన్ యువత రెండేళ్ల పాటు భారత్‌లో ఉండొచ్చు. అదే విధంగా భారతీయులు కూడా బ్రిటన్ లో నివసించే అవకాశం కల్పిస్తున్నారు.