ఉన్న కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులతోనే భయపడుతున్న సమయంలో యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్ అందర్నీ హాడలెత్తించింది. పాత స్ట్రెయిన్ కన్నా అధిక వేగంతో, ఎక్కువ మందికి సోకే సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. దీంతో ఇంగ్లాండ్, అమెరికా సహా పలు దేశాలు కేసులు, మరణాలు పెరగ్గా… భారత్ వంటి దేశాలు మరోసారి యూకేపై ట్రావల్ బ్యాన్ విధించాల్సి వచ్చింది.
అయితే, తాజాగా మరో అధ్యయనం మరింత భయపెట్టే వార్తను తెలిపింది. ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ కూడా తన రూపం మార్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని యూకే నిపుణులు గుర్తించినట్లు బీబీసీ ప్రకటించింది. ఈ మరో కొత్త స్ట్రెయిన్ కూడా మరింత ప్రమాదకరమని యూకే అలర్ట్ చేసింది.
అయితే, కొత్త స్ట్రెయిన్ పై పనిచేస్తున్నట్లుగానే… ఇప్పుడు రూపం మారిన వైరస్ ను కూడా వ్యాక్సిన్లు ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లుగానే భావిస్తున్నట్లు తెలిపారు.