హైదరాబాద్ లో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ లక్షణాలతో ఓ మహిళకు కోరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈమె బ్రిటన్ నుంచి నగరానికి వచ్చింది. ఆమె శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్స్‌కు పంపించామని చెప్పారు హెల్త్ డైరైక్టర్ శ్రీనివాసరావు. విదేశాల నుంచి ఇప్పటి వరకు 325 మంది రాగా అందులో ఒక్క మహిళకు పాజిటివ్ వచ్చిందని వివరించారు.
పాజిటివ్ వచ్చిన మహిళను టిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లండించారు శ్రీనివాసరావు. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.