వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని ఇండియా రానున్నారు. ప్రధాని మోదీ నవంబర్ 27న బోరిస్ జాన్సన్‌కు ఫోన్ చేసి.. జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని తాజాగా ఆయన అంగీకరించారు. ఈ మేరకు భారత పర్యటనలో బ్రిటన్ విదేశాంగ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు.
గతంలో 1993లో నాటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు ఇప్పుడు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ పాల్గొంటున్నారు. రిపబ్లిక్ వేడుకలకు ఏటా ఏదేని దేశానికి చెందిన అధ్యక్షుడిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడం భారతదేశ సంప్రదాయంగా వస్తోంది. కాగా వచ్చే ఏడాది నిర్వహించే జీ7 సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోదీని కూడా జాన్సన్ ఇటీవల ఆహ్వానించారు.