కొత్త సంవత్సరాన్ని రష్యా యుద్ధంతో ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజధాని లక్ష్యంగా కామికేజి డ్రోన్లతో విరుచుకు పడుతోంది. ఉక్రెయిన్ గాంభీర్యాన్ని అణచివేసే క్రమంలో తెల్లవారు జామునుంచి తన పంధాని కొనసాగిస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రభుత్వం నగర పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం.
కీవ్ నగరం పై వైమానిక దాడి అంటూ ఎయర్ అలెర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రకటించింది ఉక్రెయిన్. ప్రజలు సురక్షిత షెల్టర్ జోన్లలో తలదాచుకోవాలని సూచించింది. మేయర్ విటాలి క్లిట్కో మాట్లాడుతూ ఈశాన్య డెన్న్యాన్స్కీ జిల్లాలో పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలు అందుబాట్లోకి తెచ్చినట్లు తెలిపింది.
డెన్న్యాన్స్కీలో 19 ఏళ్ళ యువకుడు గాయపడినట్లు వెల్లడించారు. రష్యావైమానిక దాడిలో ఉక్రెయిన్ గగనతల వ్యవస్థ హై అలర్ట్ ప్రకటించింది. కీవ్ ప్రాంతంలో ప్రమాదం కొనసాగుతోందని…తమ వైమానిక రక్షణ దళాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కీవ్ రీజియన్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఒలెక్సీ కుబేలా అన్నారు.
శనివారం జరిగిన రష్యా దాడిలో కీవ్, ఇతర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఆదివారం జపోరిజ్జియా దక్షిణ ప్రాంతలో జరిగిన ఎటాక్ లో మరో వ్యక్తి చనిపోయాడు. నిజానికి యుద్ధం ప్రారంభమై 10 నెలలు కావొస్తోంది. అయినా ఇరు దేశాల మధ్యా యుద్ధం ముగింపు దశకు రాలేదు. తాము గెలుపొందేవరకూ పోరాడుతుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పట్టుదలతో ఉన్నాడు .
ఈ ప్రకటినతో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని తెలుస్తోంది,ఇక రష్యా కూడా ఇదే ధోరణిలో ఉంటోంది. ఓ వైపు చర్చలకు రష్యా సిద్ధమని చెబుతున్నా..మరో వైపు పుతిన్ ఉన్నంత వరకూ చర్చల ఊసులేదని ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధం త్వరగా ముగియాలని సామాన్యప్రజలు కోరుకుంటున్నారు.