ఉక్రెయిన్ లో జన్మించిన రష్యన్ వ్యాపార వేత్త ఒకరు ఆగ్నేయ ఇంగ్లాండ్ లో సర్రెలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చమురు, గ్యాస్ వ్యాపార దిగ్గజం మైఖేల్ వాట్ ఫోర్డ్(66) సర్రేలోని వర్జీనియా వాటర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయారు.
ఇటీవల రష్యన్ వ్యాపార వేత్తలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆయన మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఆయన మిత్రుడు సన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితుల వల్ల అతని మానసిక స్థితి ప్రభావితమై ఉండవచ్చని తెలిపారు.
అతని మరణ సమయం, ఉక్రెయిన్ దాడి ఖచ్చితంగా ఒకే సమయంలో జరిగినవి కాదు. ఇక బ్రిటన్ నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యాపారుల జాబితాలో ఆయన పేరులేదని సన్ వెల్లడించారు.
కానీ మైఖేల్ మరణంలో అతని ఇతర స్నేహితులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ లో పలువురు రష్యన్ జాతీయుల, వారి సహచరుల అనుమానాస్పద మరణాల నేపథ్యంలో ఆయన మరణంపై కూడా అనుమానాలు ఉండటం సహజమని చెబుతున్నారు.