ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ ను దారిలోకి తెచ్చుకోవాలని రష్యా చూస్తున్నట్టు తెలుస్తోంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది.
ఇప్పుడు దాని కన్ను ఉక్రెయిన్ పైన పడ్డట్టు తెలుస్తోంది. సోవియట్ యూనియన్ సమయంలో డెనిపర్ నదిద్వారా కెనాల్ ను ఏర్పాటు చేసి క్రిమియాకు తాగునీటిని అందించేవారు. అంతేకాదు.. రష్యా వైమానిక స్థావరానికి తాగునీటి అవసరాలకు డెనిపర్ నది నుంచే నీటి సరఫరా అయ్యేది.
2014లో జరిగిన పరిణామాల తరువాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట కట్టడంతో నీటి సరఫరా తగ్గిపోయింది. దీంతో క్రిమియా, రష్యా వైమానిక స్థావరాలకు నీటి సరఫరా కోసం పెద్ద మొత్తంలో రష్యా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఈ ఖర్చుల నుంచి బయటపడాలి అంటే డెనిపర్ నదిపై కట్టిన ఆనకట్టపై ఆధిపత్యం సంపాదించాలి. రష్యా దీని కోసమే ఉక్రెయిన్ తో లొల్లికి దిగిందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. గతంలో నీటికోసం యుద్దాలు జరిగాయి. ఒకవేళ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగితే.. ఆధునిక కాలంలో నీటికోసం జరిగే తొలియుద్ధం ఇదే అవుతుందని పరిశీలకులు చెప్తున్నారు.