ఉక్రెయిన్ లో 20వేల మందికి పైగా ఉన్న విద్యార్థుల్లో కొందరు స్వదేశానికి తిరిగి రాగా.. మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారత్ సాయం కోరింది. ప్రపంచంలో శాంతి తీసుకొచ్చే సత్తా ఒక్క భారత్ కే ఉందని అన్నారు ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పొలిఖా.
ఉక్రెయిన్ లో పరిస్థితి చేయిదాటిపోకుండా భారత్ సాయం చేయాలని కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించి.. యుద్ధం ఆపేందుకు ప్రధాని మోడీ కృషి చేయాలని అభ్యర్థించారు.
ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానుల్లో మోడీ ఒకరని చెప్పిన పొలిఖా.. రష్యా అధ్యక్షుడ్ని ప్రభావితం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఉక్రెయిన్ కు సాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా పొలిఖా.. మహాభారతాన్ని ఉదహరించారు. పుతిన్ తో దౌత్యం కొనసాగించాలని.. ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్ కు కూడా సాయం చేయాలన్నారు. యూరప్ లో నాగరికత లేనప్పుడే.. అనేక వేల సంవత్సరాల క్రితం కౌటిల్య, చాణక్యుడి ద్వారా భారతదేశం దౌత్యంలో అర్హత సాధించిందని తెలిపారు. అందుకే మోడీ.. పుతిన్ తో చర్చలు జరపాలని కోరారు పొలిఖా.