రష్యా దాడులను ఆలస్యం చేసేందుకు ఉక్రెయినియన్లు తమదైన శైలిలో ప్రయత్నాలను చేస్తున్నారు. తాజాగా రష్యా సైనికులను గందరగోళానికి గురి చేసేందుకు గాను ఆదేశంలోని ఓ సంస్థ కొత్త ఆలోచనలు చేసింది.
ఉక్రెయిన్ కు చెందిన భవనాలు, రోడ్ల నిర్వహణను చూసుకునే సంస్థ పలు ప్రాంతాల్లోని రహదారుల చిహ్నలను తొలగిస్తోంది. అలా తొలగించడం ద్వారా రష్యా దళాలు నగరంలో అవి వెళ్లాల్సిన దారులను తెలుసుకోవడంలో గందర గోళానికి గురవతాయని చెబుతున్నారు.
టైర్లను కాల్చడం, చెట్లను అడ్డంగా వేయడం, బారికేడ్లను పెట్టడం లాంటి అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను ఉపయోగించి శత్రువులను అడ్డుకోవాలని ఉక్రేయిన్ పౌరులను ఆ సంస్థ కోరింది.
ఇక ఇప్పటికే రష్యా దళాలు ఉక్రెయిన్ లోని రెండవ పెద్దనగరమైన కార్కివ్ లోకి చేరుకున్నాయి. ఆ నగరంలో రష్యా దళాలకు ఉక్రెయిన్ సేనలు ధీటుగా సమాధానం ఇస్తు్న్నాయి.