రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలని, ఈ యుద్ధం వల్ల అందరి ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని ఆయనకు వివరించాలని ప్రధాని మోడీని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కోరారు.
ఈ మేరకు ఓ టెలివిజన్ షోలో ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయ పౌరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కీవ్ లో పరిస్థితుల నేపథ్యంలో భారతీయ పౌరుల మద్దతు కావాలని అభ్యర్థించారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి వస్తున్న మద్దతుపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘ రష్యా అధ్యక్షుడితో మాట్లాడాలని, యుద్దం వల్ల అందరి ప్రయోజనాలకు దెబ్బతింటాయన్న విషయాన్ని వివరించాలని ప్రధాని మోడీని మేము కోరుతాము’ అని పేర్కొన్నారు.
‘ ఈ మొత్తం భూ గ్రహం మీద ఈ యుద్ధం పట్ల ఆసక్తి ఉన్న ఏకైక వ్యక్తి అధ్యక్షుడు పుతిన్ మాత్రమే. రష్యా ప్రజలు ఈ యుద్ధం పట్ల ఆసక్తి చూపడం లేదు” అని తెలిపారు.