బెలారస్ లో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది. బెలారస్ నుంచి రష్యా దాడుల చేస్తున్న విషయాన్ని ఉక్రెయిన్ గుర్తు చేసింది.
అందువల్ల బెలారస్ కాకుండా వేరే ప్రాంతాల్లో చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. పోలాండ్ రాజధాని వార్సా, బ్రటిస్ లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్ బాకు ప్రాంతాలు చర్చలకు తమకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు నాలుగో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆ దేశంపై అన్ని వైపుల నుంచి దాడులు చేయాలని రష్యా సైన్యాన్ని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు.
ఉక్రెయిన్ పై పోరులో తెగువ చూపుతున్న రష్యా సైనికులను రష్యా అధ్యక్షుడు అభినందించారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ఆయన కోరారు.