జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు దర్శకుడు అనుదీప్. ప్రస్తుతం తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా గురువారం జరిగాయి.
ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాను ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ దక్షిణాది యువకుడు విదేశీ అమ్మాయి మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట.
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యబోశాప్క ను ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారట మేకర్స్. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.