రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం ఇస్తోంది. తాజాగా కొంత మంది రష్యా సైనికులు తమ చేతికి చిక్కినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి డిమైట్రో కులేబా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘ రష్యా సైనికుల తల్లులారా, భార్యలారా, కుమార్తెలారా .. మీ వాళ్లను ఇంటికి తీసుకువెళ్లండి. అమాయకులను చంపేందుకు, మా ఇండ్లను నాశనం చేసేందుకు మీ వాళ్లు విదేశీ గడ్డపైకి వచ్చారు. ఈ యుద్ధం ఆపండని మీ అధికారులను అడగండి. మీ ప్రియమైన వారిని కాపాడుకోండి” అని ట్వీట్ చేశారు.
రష్యా నియంత్రణ కోల్పోయి తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. రష్యన్ భూభాగాలపై ఉక్రెయిన్ అణుబాంబులను వేస్తుందన్న భావనలో ఆదేశం ఉందన్నారు.
కానీ ఇదంతా అవాస్తవమన్నారు. ఉక్రెయిన్ దగ్గర అణు ఆయుధాలు లేవని తెలిపారు. అణు ఆయుధాలు సమకూర్చుకోవడానికి తామెప్పుడూ ప్రయత్నించలేదని వెల్లడించారు.