రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం భీకర పోరాటాన్ని సాగిస్తోంది. ఇలాంటి భయానకమైన పరిస్థితిలో ఓ ఆసక్తికరమైన ఘటన ఉక్రెయిన్ సైన్యంలో చోటుచేసుకుంది.

వారిద్దరు కాల్పుల మోతల మధ్యే సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. వీరి వివాహం జరుగుతున్న సమయలోనే రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు.
అయితే.. వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యా భీకర కాల్పుల చప్పుడు వారికి పెళ్లి భాజాలు అయ్యాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.