హిందువుల పండగ దీపావళికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. త్వరలో పండగ సమీపిస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం తమ దేశంలోని భారతీయల మనసులని గెలుచుకునే ప్రయత్నం చేసింది. బ్రిటన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాయల్ మింట్.. లక్ష్మీదేవి చిత్రంతో కూడిన గోల్డ్ బిస్కెట్లను రూపొందించింది. బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.
C
ఒక్కో గోల్డ్ బిస్కెట్ ను 20 గ్రాముల బరువు ఉండేలా వీటిని తయారు చేయించింది రాయల్ మింట్. ఒక్కోదాని ధర సుమారు 1,080 పౌండ్లుగా నిర్ణయించింది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ.1,08,500. రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మా నోబెల్.. బంగారు బిస్కెట్‌పై లక్ష్మీదేవి చిత్రాన్ని గీశారు. ఇందుకోసం శ్రీ స్వామి నారాయణ్ ఆలయ కార్డీఫ్ సహకారాన్ని తీసుకున్నారు. దీపావళి సమయంలో..భారతీయులు బంగారం కొనుగోలుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని తెలిసి తాము ఇలా చేసినట్టుగా మింట్ అధికారులు చెబుతున్నారు.