భారత బ్యాట్స్‌మెన్స్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. మంగళవారం విరాట్ కోహ్లి బ్యాట్ తో చెలరేగిపోయి శతకాన్ని నమోదు చేశాడు. ఇదే వన్డే మ్యాచా్‌లో మన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సూపర్ ఎక్స్‌ప్రెస్ లాగా బాల్ డెలివరీ చేసి రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 156 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఈ ఘనత సాధించాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తన రికార్డు (గంటకు 155 కిలోమీటర్లు)ను తానే అధిగమించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఓవర్‌లో వరుసగా గంటకు 147, 151, 156, 146, 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. ఉమ్రాన్ బౌలింగ్‌కు వణికిపోయిన లంక బ్యాటర్ అసలంక ఈ ఓవర్ చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకినట్లు కనిపించలేదు.
అతని ప్యాడ్స్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. కానీ ఉమ్రాన్ వేగవంతమైన బంతులకు అసలంక మైండ్.. బ్లాంక్ అయ్యింది. దాంతో అతను బ్యాట్‌కు తాకకున్నా .. తాకినట్లు భావించి క్రీజును వదిలాడు. ఇక ఐపీఎల్‌లో ఉమ్రాన్ మాలిక్ గంటకు 157 కిలోమీటర్లతో బౌలింగ్ చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బౌలింగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఉమ్రాన్ జట్టులో ఉంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 113) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 136 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అవిష్కా ఫెర్నాండో(5), కుశాల్ మెండీస్(0)లను మహమ్మద్ సిరాజ్ ఔట్ చేయగా.. అసలంకను ఉమ్రాన్, ధనుంజయ డిసిల్వా(47)ను షమీ ఔట్ చేశాడు. క్రీజులో పాతుమ్ నిస్సంక(65 బ్యాటింగ్), డసన్ షనక(6 బ్యాటింగ్) ఉన్నారు.