జమ్మూ కశ్మీర్ లో పరిస్థితిపై చర్చించడానికి చైనా విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ రోజు సమావేశం కానుంది. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ దశాబ్ధాలుగా ఉన్న ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన దానిపై పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఈ విషయంపై ఆగస్టులోనే భద్రతా మండలి ఒకసారి సమావేశమైంది. చైనా విజ్ఞప్తితో రెండో సారి సమావేశమవుతుంది. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ విదేశాంగా మంత్రి షా మహమూద్ ఖురేషి డిసెంబర్ 12న భద్రతా మండలికి లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి తీవ్రత, అది మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పాకిస్థాన్ వ్యక్తం చేసిన ఆందోళలనను మండలిలో చైనా గట్టిగా వినిపించనుంది.