ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జైష్-ఎ-మహ్మద్, లష్కరే తోయిబా వంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు.. ఆఫ్ఘానిస్తాన్ లోని కొన్ని ప్రావిన్సులలో తమ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిక్షణ శిబిరాలపై తాజాగా యూఎన్ రిపోర్ట్ ను విడుదల చేసింది. కొన్ని శిబిరాలు నేరుగా తాలిబన్ నియంత్రణలో ఉన్నాయని పేర్కొంది.
గతేడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఐరాస విడుదల చేసిన మొదటి నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. సభ్య-దేశాలతో సంప్రదింపుల ఆధారంగా తీర్మానాలు రూపొందించారని తెలిపింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ సహా పలు ఉగ్రవాద సంస్థల నుంచి తాలిబన్లకు నిధులు అందుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక బహిర్గతం చేసింది.
లష్కరే తోయిబా.. తాలిబాన్ కార్యకలాపాలకు ఆర్థిక మరియు శిక్షణా నైపుణ్యాన్ని అందించినట్లు మునుపటి మానిటరింగ్ టీమ్ నివేదికలలో వివరించబడింది. అయితే.. జైష్ ఎ మొహమ్మద్, సైద్ధాంతికంగా తాలిబాన్ కు దగ్గరగా ఉన్న దేవ్ బందీ గ్రూపు ఎనిమిది శిక్షణా శిబిరాలను నంగర్ హార్ లో నిర్వహిస్తోందని నివేదికలో పేర్కొనబడింది. ఈ ఎనిమిదింటిలో మూడు గ్రూప్ లు నేరుగా తాలిబన్ ల ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపింది.
మసూద్ అజార్ నేతృత్వంలోని దేవ్ బందీ గ్రూపు జైషే మహ్మద్ సైద్ధాంతికంగా తాలిబన్ తో సన్నిహితంగా ఉందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ లో జైషే మొహమ్మద్ కు కొత్తగా ఖరీ రంజాన్ నియమితులయ్యారు.. కాగా ఏ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్గన్ భూభాగాన్ని ఉపయోగించడానికి ఎవరినీ అప్ఘాన్ ప్రభుత్వం అనుమతించడం లేదని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ చీఫ్ సుహైల్ షాహీన్ చెప్పారు.
అయితే, అఫ్ఘాన్ భూభాగంలో పాక్ ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు, తాలిబన్లతో సంబంధాలపై భారత్ ఆందోళన చెందుతోంది. అఫ్ఘానిస్తాలో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ కార్యకలాపాలు పున ప్రారంభం, అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాదుల ఉనికిని ఐరాస తాజా నివేదిక బట్టబయలు చేసింది. తాలిబన్లకు లష్కరే తొయిబా ఆర్థిక సహాయం, శిక్షణ ఎలా అందించిందో మునుపటి నివేదికలో హైలైట్ చేసింది.
180 నుంచి 400 మంది వరకు ముష్కరులు ఉన్నట్లు అంచనా వేసింది. వీరిలో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలిపింది. 2015లో అగ్రరాజ్యం, అఫ్గాన్ సంయుక్తంగా కాందహార్‌లో జరిపిన దాడిలో ఏక్యూఐఎస్‌కు ఉన్న సామర్థ్యం కంటే ప్రస్తుతం ఇంకా బలహీనపడినట్లు అంచనా వేసింది.
అయితే.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా.. అఫ్గానిస్థాన్‌లోని పలు రాష్ట్రాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయని తెలిపింది. వారిలో కొంత మంది నేరుగా తాలిబన్ నియంత్రణలో ఉన్నట్లు పేర్కొంది. నంగర్హార్ ప్రాంతంలో జైషే ఉగ్రసంస్థ 8 క్యాంపులు నిర్వహిస్తుండగా.. అందులో మూడు తాలిబన్ల నియంత్రణలో ఉన్నట్లు తెలిపింది నివేదిక.